స్టార్ స్ప్రింటర్, తెలుగమ్మాయి యర్రాజీ జ్యోతి జాతీయ క్రీడల్లో అదరగొట్టింది. వరుసగా మూడోసారి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచింది. ఆదివారం ఆమె పరుగును 13.10 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. 2022 గుజరాత్, 2023 గోవా జాతీయ క్రీడల్లోనూ ఇదే విభాగంలో జ్యోతి బంగారు పతకాలు గెలుచుకుంది. పురుషుల విభాగంలో తేజస్ శిర్సే కూడా హ్యాట్రిక్ స్వర్ణంతో మెరిశాడు.