కాళేశ్వరం ఈఈ శ్రీధర్‌కు రూ.200 కోట్ల ఆస్తులు!

81చూసినవారు
కాళేశ్వరం ఈఈ శ్రీధర్‌కు రూ.200 కోట్ల ఆస్తులు!
TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారులు శ్రీధర్‌ను నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా.. రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రూ.200 కోట్లకు పైగా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా డబ్బు, బంగారం, డైమండ్స్, ప్లాటినం ఆభరణాలు బయటపడ్డాయి.

సంబంధిత పోస్ట్