ప్రాజెక్టు ఎలా కట్టకూడదో కాళేశ్వరం ఉదాహరణ: సీఎం రేవంత్

60చూసినవారు
ప్రాజెక్టు ఎలా కట్టకూడదో కాళేశ్వరం ఉదాహరణ: సీఎం రేవంత్
TG: నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. పదేళ్లు నియామకాలు చేపట్టలేదు. 423 మందికి నియామకపత్రాలు ఇస్తున్నాం. 14 నెలల్లో 1,100 మందికి ఉద్యోగాలిచ్చాం. 14 నెలల్లో 2 వేల మంది లష్కర్‌లను నియమించాం' అని సీఎం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్