TG: కాళేశ్వరానికి అన్నీ నేనే అన్న కేసీఆర్ ఇప్పుడు సంబంధం లేదంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని సంచలన డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించాక ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదని, ఎల్లంపల్లి ద్వారానే పంటకు నీళ్లు అందుతున్నాయన్నారు.