ఉద్రిక్తతల వేళ.. కమల్‌హాసన్‌ ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌ వాయిదా

60చూసినవారు
ఉద్రిక్తతల వేళ.. కమల్‌హాసన్‌ ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌ వాయిదా
కమల్‌హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. జూన్ 5న విడుదల కానుంది. ‘దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల రీత్యా మే 16న జరగనున్న ‘థగ్‌ లైఫ్‌’ ఆడియో రిలీజ్‌ను వాయిదా వేశాం. మన మాతృభూమి పరిరక్షణలో సైనికులు ఎంతగానో పోరాడుతోన్న వేళ ఇది వేడుకలకు సమయం కాదని నమ్ముతున్నాం. సైనికులకు మా మద్దతు తెలియజేస్తున్నాం’ అని కమల్‌హాసన్‌ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు. ఈవెంట్ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్