ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమెరుగని భారత్.. ట్రోఫీని ముద్దాడడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనుంది. వరుణ్ స్పిన్ మాయజాలం, కోహ్లీ మరోసారి అద్భుత ఇన్సింగ్స్ ఆడితే న్యూజిలాండ్‌ను ఓడించడం కష్టామేమీ కాదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఏదిఏమైనా 2000 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకొని మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.