మహాత్మ జ్యోతిబాపూలే జయంతి జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడుగా ఎలుక జీవన్ గౌడ్ ను నియమిస్తున్నట్లు తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఛైర్మన్ తెలియజేశారు. ఎలుక జీవన్ గౌడ్ మాట్లాడుతూ బీసీల కోసం అనుక్షణం తన వంతు కృషి చేస్తానని, జ్యోతిబాపూలే ఆశయ సాధన కోసం పనిచేస్తానని, జ్యోతిబాపూలే ఆశయాలను కొనసాగిస్తానని బీసీలకు ఏ సమస్య వచ్చినా వారి పక్షాన నిలబడి పోరాడుతానని అన్నారు.