బాన్సువాడ సెగ్మెంట్ నస్రుల్లాబాద్ మండలం అంకోల్ లో పేకాడుతున్న 9 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు. మంగళవారం ఎస్ఐ మాట్లాడుతూ 9సెల్ ఫోన్లు, 6 బైకులు, రూ. 1, 190 నగదును వారి వద్దనుండి స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికైనా పేకాట సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు.