కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని గురువారం గ్రామ చావిడి వద్ద కోలాటం ఆడారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఈ కోలాటాన్ని ఈ సంవత్సరం కూడా ఉత్సాహంగా ఆడారు. ఒకరి చేతి కర్రలకు మరొకరి చేతి కర్రలకు ప్రతిఘటిస్తూ చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆడారు. ఈ కోలాటాన్ని గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు ఎంతో ఆసక్తికరంగా తిలకించారు.