బాన్సువాడ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని, కాలం చెల్లిన బస్సులను నడపకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఉపాధ్యక్షుడు గుడుగుట్ల అనిల్‌కుమార్ కోరారు. మరమ్మత్తులు చేయించి అర్హత ఉన్న డ్రైవర్లను నియమించాలని, విద్యార్థుల భద్రతను అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు.