కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ పట్టణంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు జై బాపూ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బీన్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పత్తి రాము, తదితరులు పాల్గొన్నారు.