బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ ను నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి, వర్ని మండలం జలల్ పూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని పలు కాలనీలో చేసిన సేవలను కొనియాడారు. పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేయాలని వారు జుబేర్ ను కోరారు.