బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేసి సహకరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు ని షాది ఖానా చైర్మన్ అబ్దుల్ వహాబ్ ఆధ్వర్యంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించిన బాన్సువాడ పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.