బాన్సువాడ: అది జెండా మాత్రమే కాదు.. మా ఆత్మగౌరవం

83చూసినవారు
బాన్సువాడ: అది జెండా మాత్రమే కాదు.. మా ఆత్మగౌరవం
బాన్సువాడ మండలం బొర్లం క్యాంపు గ్రామంలో గల బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో జెండా గద్దె విరిగింది. ఇది గమనించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన మంగళవారం జెండా గద్దె మరమ్మత్తుల పనులు కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ప్రారంభించారు. అది కేవలం జెండా మాత్రమే కాదు, మా ఆత్మగౌరవం అని కార్యకర్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్