బాన్సువాడ మండలంలో దేశాయిపేట్ గ్రామంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మాత రామబాయి అంబేద్కర్ 126వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగం రచించి, అందించిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు మద్దతుగా ఆయన విద్యను కొనసాగించడానికి ఎంతగానో ప్రోత్సహించిందని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు.