బాన్సువాడ: ముగిసిన పండరీపూర్ మహా పాదయాత్ర

62చూసినవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ హనుమాన్ మందిరం నుండి ప్రారంభించిన పండరీపూర్ భక్తుల మహా పాదయాత్ర నేటితో ముగిసింది. బుధవారానికి పండరీపూర్ చేరుకున్నట్లు అధ్యక్షుడు కరణ్ మహారాజ్ తెలిపారు. వందలాది మందితో కొనసాగిన మహా పాదయాత్ర 13 రోజుల తర్వాత పండరీపూర్ కు చేరుకున్నదని, ఆటపాటలతో ఆలయానికి వెళుతున్నామని పేర్కొన్నారు. ఇందులో మనోహర్, రామ్ రెడ్డి, విట్టల్ రెడ్డి, గంగారం, రాములు, గురు శేఖర్, నవీన్ గౌడ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్