కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గo పోతంగల్, వర్ని మండల కేంద్రాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో పోతంగల్, వర్ని, చందూర్ మండలాల కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ 90 మంది లబ్ధిదారులకు చెక్కులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.