కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో రూ. 37. 50 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టరుతో వివరాలు తెలుసుకొని నాణ్యత లోపం లేకుండా నిర్మించాలని సూచించారు. వెంట ఉన్న మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.