బాన్సువాడ: బోనాల పండుగలో పాల్గొన్న పోచారం, కాసుల

84చూసినవారు
బాన్సువాడ: బోనాల పండుగలో పాల్గొన్న పోచారం, కాసుల
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ 12వ వార్డులో మంగళవారం శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో జరిగిన బోనాల పండుగలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్