కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామములో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫామ్ లు ప్రధానోపాధ్యాయులు శేఖర్ , మాజీ సర్పంచ్ వెంకటరమణ రావుతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ విట్టవ్వ , కమిటీ సభ్యులు వడ్ల లక్ష్మి, ఉపాధ్యాయులు నబి , అంజయ్య, నర్సింగ్ రావు, నర్సింలు, ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.