కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఒంటి కాలుపై నిల్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు సివిల్ సప్లై హమాలీలు. బాన్సువాడ పట్టణంలో ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సివిల్ సప్లై హమాలీల నిరవధిక సమ్మె నాలుగవ రోజుకు చేరింది. హమాలి రేట్ల పెంపుపై జీవో విడుదల చేయాలని ఇతర సమస్యల పరిష్కారం కై శనివారం సివిల్ సప్లై హమాలీలు ఒంటి కాలుపై నిల్చుని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం తెలియజేశారు.