బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో శుక్రవారం అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకులు రమాబాయికి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మాతృమూర్తి అని ఆమెను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నెర్రె నర్సింలు, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య తదితరులు పాల్గొన్నారు.