బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఆకతాయిలు హంగామా సృష్టించారు. పాఠశాలలో మద్యం సేవించి బీరు బాటిళ్లను కిటికీలను తెరిచి తరగతి గదులలో పగులగొట్టారు. టేబుల్ లను విరగొట్టారు. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ప్రధాన ఉపాధ్యాయురాలు చూసి గ్రామ పెద్దలకు, మండల విద్యాశాఖ అధికారికి తెలియజేశారు. ఈ పని ఆకతాయిలదేనని పలువురు ఆరోపిస్తున్నారు.