కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల ఆర్టీఐ అధ్యక్షులు వడ్ల శివరాం శ్రీను మానవత్వాన్ని చాటుకున్నారు. నిర్మల్ జిల్లా జ్ఞాన సరస్వతి దర్శనానికి బాసర వెళ్లారు. పుష్కరఘాట్ వద్ద హ్యాండ్ బ్యాగ్ పడి ఉన్నది. ఆ బ్యాగ్లో రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. గమనించిన శివరాం ఆ బ్యాగును తీసుకెళ్లి దేవస్థాన కౌంట్రోల్ రూమ్ లో ఇచ్చారు. దేవస్థాన సిబ్బంది మైక్ లో అన్నోన్స్మెంట్ చేయగా కొద్దిసేపటికి బ్యాగ్ ను పోగొట్టుకున్నవారు వచ్చారు. ఆ బ్యాగ్ ను వారికీ ఇవ్వడం జరిగింది.