బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరింది. ఈ సందర్భంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ, బీర్కూర్ లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను ఆమె పరిశీలించారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను పరిశీలించి సలహా సూచనలు చేశారు. పోలింగ్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.