కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నందు తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం మంగళవారం జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ గుప్త సమక్షంలో జిల్లా ఉపాధ్యక్షులు గా కడెం బాబా గౌడ్ ను ఉమ్మడి బీర్కూర్, నసురల్లాబాద్ మండల అధ్యక్షులు గా అరెళ్ల పవన్ గౌడ్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గంజివార్ చందు, మజీద్, భాస్కర్ గౌడ్, కృష్ణ, తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.