కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామంలో మంగళవారం భూభారతి రెవెన్యూ సదస్సును తహశీల్దార్ దశరథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలకు సంబంధించి 34 దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. ఈ సదస్సులను రైతులు, ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ఆయన సూచించారు.