కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ లో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. గుంపులుగుంపులుగా దర్శనమిస్తూ కనబడిన వారి వెంటపడుతున్నాయి. మంగళవారం నలుగురు కాటుకు గురైయ్యారు. అధికారులు వెంటనే స్పందించి విధి కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.