ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జన్మదిన సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర పాఠశాలలో కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ గఫార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుక ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు, ప్రిన్సిపల్ రఫత్ తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు, స్థానిక యువకులు పాల్గొన్నారు