
విడాకులకు శోభిత కారణమే కాదు: నాగ చైతన్య
సమంతతో తాను విడాకులు తీసుకోవడానికి శోభత ధూళిపాళ్ల కారణమని జరిగిన ప్రచారంపై హీరో నాగ చైతన్య స్పందించారు. 'ఇది చూసి నేను చాలా బాధపడ్డా. ఆమెకు ఈ చెడ్డపేరు రావాల్సింది కాదు. విడాకులకు శోభిత కారణమే కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్స్టా చాట్లా చాలా సాధారణంగా, అందంగా వచ్చింది. మా మధ్య తొలుత స్నేహం, ఆ తర్వాత రిలేషన్ షిప్ మొదలైంది' అని వ్యాఖ్యానించారు. కాగా 2021లో సమంతతో విడిపోయిన నాగ చైతన్య 2024లో శోభితను పెళ్లి చేసుకున్నారు.