ఎస్సీ వర్గీకరణ అమలుకై ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరుగుతున్న వెయ్యి గొంతులు లక్ష డప్పులు మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ వాల్ పోస్టర్లు బుధవారం బొర్లం గ్రామంలో ఏమర్పీఎస్ నాయకులు అతికించారు. అలాగే ఏమర్పీఎస్ అధ్యక్షులు ఎర్రోళ్ల సాయిలు మాట్లాడుతూ.. ప్రతి ఒక్క మాదిగ బిడ్డ డప్పు వేసుకొని భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.