కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లo గ్రామంలో శుక్రవారం ఉన్నత పాఠశాలలో మండల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కమటాల శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ శ్రావణి దేవేందర్ రెడ్డిలు ప్రధానోపాధ్యాయులు వెంకటరమణతో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల పద్మ శ్రీనివాస్, నరసింహచారి, అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.