ప్రజా భవన్ ముట్టడికి వెళ్లకుండా బిచ్కుంద మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గురువారం ముందస్తు అరెస్టు చేశారు. షరతులు లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో నియోజకవర్గం నుంచి తరలి వెళ్లకుండా నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారిలో మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, గణేష్ గొండ బొమ్మల లక్ష్మణ్ ఉన్నారు.