కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి రేపు ఆదివారం 24న మహా అవధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు విచ్చేయుచున్నట్లు శ్రీ అయ్యప్ప సేవా సమితి సభ్యులు శనివారం బాన్సువాడలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సాయంత్రం ఐదు గంటలకు ప్రవచనం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.