ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ గ్రామంలో గల మసీద్ తో పాటు దర్గాకు వెళ్లే ఆరు ఫీట్ల దారిలో అనుమతికి విరుద్ధంగా గ్రామానికి చెందిన ఒకరు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను చేపట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయని మజీద్ కమిటీ సభ్యులు సాదిక్ వెల్లడించారు, గ్రామపంచాయతీ కార్యదర్శికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని మంగళవారం పంచాయతీ కార్యదర్శితో కలిసి ఆ స్థలానికి వెళ్లి ఆయన దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని వారు తెలియజేశారు.