బాన్సువాడ రూరల్ పరిధిలోని బిపిఎల్ కుటుంబాలకు చెందిన వారు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని రూరల్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ వరకు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని బిపిఎల్ కుటుంబాలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలన్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం 938 రూపాయలతో పాటు ఇంటి పన్ను రసీదు, ఆధార్ కార్డు ఫోటోతో దరఖాస్తు అధికారులకు అందజేయాలన్నారు.