
ఉ.10.30 గంటలకు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
AP: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఉ.10.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు పాల్గొంటారు. వైసీపీ కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, కూటమి ఏడాది పాలన వైఫల్యాలపై చర్చిస్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై పార్టీ నాయకులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.