బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలోని వెంకటేశ్వర, రుక్మిణి సమేత విఠలేశ్వర, జోడ హనుమాన్ ఆలయానికి విచ్చేసిన పోచారం శంభు రెడ్డిని గ్రామ పెద్దలు శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉద్దేరా హన్మాండ్లు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, నాగులూరి శ్రీనివాస్ గుప్తా, నారాయణరెడ్డి, రాజులు గుప్తా, రాజిరెడ్డి, పండరి, సాయిలు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.