కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో డోంగ్లి మండలంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభ, శాసనమండలిలో అమోదం పొందిన సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు శశాంక్ పటేల్, చాంద్ పటేల్, యునుస్ పటేల్, గైక్వాడ్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.