బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ మండల నాయకుల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేసిన వ్యాఖ్యలను మంగళవారం బోర్లం బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ, అవి పూర్తిగా ప్రజా సంక్షేమ పథకాల కోసమే వినియోగించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు చేసిన అప్పులతో ఎన్ని పథకాలు ప్రవేశపెట్టారో, ఎన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారో చెప్పాలన్నారు.