మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో గత కొద్ది రోజుల నుండి సోయా కొనుగోలు కేంద్రం మూతపడటంతో సుమారు ఎనిమిది వేల క్వింటాళ్ల సోయాబీన్ ధాన్యం మిగిలిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతుండగా సోమవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు దగ్గరికి రైతులను తీసుకెళ్లి పరిస్థితి వివరించగా మంత్రి మిగిలిపోయిన సోయా పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని రైతులకు భరోసా ఇచ్చారు.