కామారెడ్డి: ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడికి సన్మానం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన శ్యాంసుందర్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అన్నివేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.