కామారెడ్డి: సమాచార హక్కు చట్టం.. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం

85చూసినవారు
కామారెడ్డి: సమాచార హక్కు చట్టం.. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం
దేశంలోనే తమకు కావలసిన సమాచారాన్ని తెలుసుకునేందుకు సమాచార హక్కుచట్టం మనకు కల్పించిందని సమాచార హక్కుచట్ట పరిరక్షణ కమిటీ బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ వడ్ల శివరాం శ్రీను శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని, గ్రామపంచాయతీ నుండి మొదలుకొని పార్లమెంటు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తమకు కావలసిన సమాచారం తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకొని 30 రోజుల్లో సమాచారం పొందవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్