హార్ట్ ఫుల్ మెడిటేషన్ సెంటర్ ను సందర్శించిన కాసుల బాలరాజ్

64చూసినవారు
హార్ట్ ఫుల్ మెడిటేషన్ సెంటర్ ను సందర్శించిన కాసుల బాలరాజ్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం సాయి కృపా నగర్ కాలనీలోని హార్ట్ ఫుల్ మెడిటేషన్ సెంటర్ ను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు సందర్శించారు. ఈ సందర్భంగా మెడిటేషన్ సభ్యులు మంత్రి శ్రీదేవి మధుసూదన్ ప్రవచనాలను విన్నారు. తదనంతరం మెడిటేషన్ సభ్యులు ఆయనను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెడిటేషన్ అభ్యాసకులు మధుసూదన్, ప్రశీల, కుశాల్, పద్మ శ్రీనివాస్, నార్ల అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్