కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామంలో సోమవారం జైకర్ శివకుమార్ ఇంటి పైన పిడుగు పడి పిల్లర్లు, వాటర్ ట్యాంకు, ఇల్లు వైరింగ్, కరెంట్ మీటర్ కాలి ధ్వంసమయ్యాయి. వర్ని ఏఎంసి చైర్మన్ సురేష్ బాబా, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు నేమాని వీర్రాజు, మైనార్టీ నాయకులు అబ్దుల్ భారీ, మండల సేవాదళ్ అధ్యక్షులు హనుమంతరావు, సాల్మన్ , విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు.