సంఘసంస్కర్త, సామాజిక తత్వవేత్త, మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేఖ్ సలాం పూలేకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ మెంబర్స్ ఎజాస్, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ హకీమ్, అధ్యాపకులు స్వరూప్, జూనియర్ అసిస్టెంట్లు అబ్దుల్ రజాక్ , పరమేష్, రజని, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.