కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం నాగారం ప్రాథమిక ఉన్నత పాఠశాలను గురువారం మండల విద్యాశాఖాధికారి నాగేశ్వర్ రావ్ సందర్శించారు. ఈ సంధర్భంగా ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల హాజరును పరిశీలించి, విద్యార్థులందరికి ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వినోద్, ఉపాధ్యాయులు ప్రసూన్, రజాక్, లాల్ సింగ్, ప్రవీణ్ కుమార్, హన్మండ్లు, భూమేష్, సతీష్ పాల్గొన్నారు.