మిర్జాపూర్: అక్రమ మద్యం అమ్మకాల నియంత్రణ చేయాలని వినతి

10చూసినవారు
మిర్జాపూర్: అక్రమ మద్యం అమ్మకాల నియంత్రణ చేయాలని వినతి
బాన్సువాడ నియోజకవర్గం మిర్జాపూర్ లో అక్రమ మద్యం అమ్మకాల నియంత్రణ చేయాలని మీర్జాపూర్ కి చెందిన సబ్బిడి రమేష్ నసరుల్లాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మిర్జాపూర్ లోని కిరాణా దుకాణాలలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని, దీని కారణంగా పాఠశాల విద్యార్థులు కూడా మద్యానికి బానిసలవుతున్నారని అన్నారు. ఈ మద్యం కారణంగా గ్రామంలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్