మిషన్ భగీరథ నల్ల కలెక్షన్ల సర్వేను పక్కాగా చేపట్టాలి

76చూసినవారు
మిషన్ భగీరథ నల్ల కలెక్షన్ల సర్వేను పక్కాగా చేపట్టాలి
గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా చేపట్టిన నల్ల కలెక్షన్ల వివరాల సర్వేను పక్కాగా చేపట్టాలని డీఎల్పిఓ నాగరాజు అన్నారు. సోమవారం బాన్సువాడ మండలంలోని దేశాయ్ పెట్ గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన 5 మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులకు మిషన్ భగీరథ సర్వేపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీ ఓలు సత్యనారాయణ రెడ్డి, అనిత, యాదగిరి, ఆయా మండలాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్