పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

52చూసినవారు
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీలలో శనివారం పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించి, డ్రైనేజీ పరిసరాలలో బ్లీచింగ్, దోమల పౌడర్ ను చల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో నార్ల ఉదయ్, శానిటేషన్ సిబ్బంది హన్మాండ్లు, సతీష్ మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్